రాష్ట్ర రవాణా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీఎస్‌ ఆర్టీసీ. పర్యావరణ హితంగా, ఇంధన వ్యయాన్ని తగ్గించే దిశగా అన్ని ఆర్టీసీ బస్సులను దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలుగా (EVs) మార్చాలని సంస్థ ప్రతిపాదించింది.

ఈ మేరకు పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగేళ్లలోపే అన్ని బస్సులను ఈవీలుగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న బస్సుల పరిస్థితిపై వివరమైన నివేదిక సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. రోడ్డు రవాణా వ్యవస్థను పర్యావరణ స్నేహపూర్వకంగా తీర్చిదిద్దడమే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశ్యం.

నూతన రోడ్‌మ్యాప్‌లో బస్సుల మార్పు, చార్జింగ్‌ స్టేషన్లు, విద్యుత్‌ వినియోగం, సాంకేతిక సిబ్బంది శిక్షణపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయనున్నారు.