మెగా డీఎస్సీ ఫలితాలు 15లోగా – కొత్త టీచర్లకు ఈ నెలాఖరులోగా పోస్టింగులు
2025 మెగా డీఎస్సీ ఫలితాలను ఈ నెల 15లోగా విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆగస్టు 16 నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుంది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా లభించకపోయినా, అవి అందిన వెంటనే కటాఫ్ మార్కులు ప్రకటించనున్నారని సమాచారం.
ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. తుది మెరుగు తర్వాత ఈ నెలాఖరులోగా కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వాలని శాఖ యోచిస్తోంది. మొత్తం 16,347 మంది ఉపాధ్యాయులకు శిక్షణను వారాంతాల్లో (శనివారం, ఆదివారం) ఇవ్వాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇది సాధారణంగా పోస్టింగ్‌కి ముందే పూర్తి చేస్తారు.
ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై ఉండటంతో, టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో వీరు సెప్టెంబర్ మొదటి వారం నుంచే విధుల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.