దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానం (OPS) రద్దు చేసి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) అమలు చేయడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విధానం ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధమని భావిస్తూ, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, విజయవాడలో APCPSEA ఆధ్వర్యంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. నినాదాలతో హోరెత్తించిన ఉద్యోగులు, OPS పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.