ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది అని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
https://whatsapp.com/channel/0029VbBL0LE96H4Txkoew114
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, మొదట దశలో విజయనగరం, ఎస్పీఎస్ ఆరుపల్లి, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, శ్రీకాకుళం, ఎగో, తూర్పుగోదావరి, గుంటూరు, ఎలూరు జిల్లాల్లో కొత్త కార్డుల పంపిణీ జరుగనుంది. ఈ జిల్లాల్లో ఆగస్టు 30 వరకు రేషన్ కార్డులు అందజేయనున్నారు.
అదే విధంగా, సెప్టెంబర్ 6 నుంచి అనంతపురం, అల్లూరి, మన్యం, కర్నూలు, నంద్యాల, అనకాపల్లి జిల్లాల్లో కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఇక సెప్టెంబర్ 15 నుంచి మిగతా జిల్లాల్లో కూడా QR కోడ్‌తో కూడిన ఆధునిక రేషన్ కార్డులను అందిస్తామని స్పష్టం చేశారు.
ఈసారి జారీ చేయబోయే కొత్త రేషన్ కార్డుల్లో భద్రతా ప్రమాణాలు మరింతగా పెంచారు. QR కోడ్ సౌకర్యం ఉండడం వల్ల కార్డుదారులు తమ వివరాలను సులభంగా ధృవీకరించుకోవచ్చు. అంతేకాకుండా, కార్డుల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు సమయానికి అందేలా జిల్లా వారీగా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కార్డుల ద్వారా పారదర్శకత పెరుగుతుంది, నకిలీ కార్డులు పూర్తిగా నిర్మూలించబడతాయి.