ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పిపోయిన బాలికలను గుర్తించి, వారిని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమం ‘Operation TRACE’ ప్రారంభమైందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, IPS తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ ట్రేస్ పోస్టర్‌ను తన కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆగస్టు 1 నుంచి 31 వరకు ప్రత్యేక డ్రైవ్ రూపంలో నిర్వహించనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.
---
TRACE అంటే ఏమిటి?
T - Trace:
CCTNS, మిషన్ వత్సల్య పోర్టల్, ఫేస్ రికగ్నిషన్, షెల్టర్లు, బార్డర్ చెక్‌పోస్టులు, NGOల సహకారంతో బాలికలను గుర్తించటం.
R - Reconnect:
కాపాడిన బాలికలను తాత్కాలిక నివాసానికి తరలించి, కుటుంబ సభ్యులతో కలిపి CWCలతో సమన్వయం చేయడం.
A - Assist:
మెడికల్ కేర్, ఆహారం, వసతి, న్యాయసలహా, వయస్సు నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం.
C - Counsel:
NGOల ద్వారా కౌన్సిలింగ్ సాయం అందించడం.
E - Empower:
చదువు, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, ప్రభుత్వ పథకాలు అందించడం.
---
కార్యాచరణ (Action Plan)
📌 ఆగస్టు 1-2: జిల్లా & సబ్ డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్‌ల ఏర్పాటు.
📌 ఆగస్టు 3-10: షెల్టర్ల తనిఖీ, FIRలు తిరిగి పరిశీలన, FACE రికగ్నిషన్, DNA, Aadhaar ఆధారిత సమాచారం సేకరణ.
📌 ఆగస్టు 11-30: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా స్థలాలు, రెడ్ లైట్ ఏరియాల్లో తనిఖీలు. "FIND HER" ప్రచారం.
---
సహాయం పొందేందుకు:
📱 Shakti App - REPORT MISSING CHILDREN ఫీచర్
📞 112 – పోలీసుల అత్యవసర సహాయం
📞 1098 – చైల్డ్ హెల్ప్ లైన్
📞 181 – ఉమెన్ హెల్ప్ లైన్
📱 WhatsApp – 7993485111
---
ప్రత్యేక చర్యలు
ప్రతి స్కూల్ నుండి 5గురు బాలికలను Shakti Warriors Groupగా ఏర్పాటు.
Good Touch - Bad Touch పై అవగాహన.
ప్రతి జిల్లా పోలీసు స్టేషన్ ద్వారా One Stop Centres ద్వారా సహాయం.
Shakti Teams ద్వారా Eve Teasingకు వ్యతిరేకంగా చర్యలు.
---
ఈ కార్యక్రమాన్ని ప్రధాన ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా యూనిట్లకు డీజీపీ ఆదేశించారు.
---
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ADGP (L&O): ఎన్. మధుసూదన రెడ్డి, IPS
IGP, APSP & In-charge Women & Child Safety Wing: బి. రాజకుమారి, IPS
SP, Women Protection Cell: ఎన్. శ్రీదేవిరావు, IPS