అన్నదాత సుఖీభవ

నేడు ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని నేడు అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 46.85 లక్షల మంది అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7 వేల చొప్పున నేరుగా జమ చేయడం జరిగింది. ఈ మొత్తం రైతుల పెట్టుబడి ఖర్చులకు తోడ్పడేలా, వ్యవసాయం పట్ల ఆసక్తి పెంచేలా ఉద్దేశించినట్టు అధికారులు తెలిపారు.

ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు వ్యవసాయ కార్యకలాపాల కోసం ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. కేంద్రంలోని పీఎం కిసాన్‌ పథకం కింద వచ్చే రూ.6,000కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 చొప్పున జమ చేయడం గమనార్హం. మొత్తం రూ.13,000 వరకూ రైతుల ఖాతాల్లోకి చేరేలా చర్యలు తీసుకుంది.

రైతుల సంక్షేమానికి ఇది ఒక పెద్ద అడుగు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో మరిన్ని వ్యవసాయ పథకాలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Click Here