పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం తోనాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఏఎన్ఎం సావిత్రి, ఆశా వర్కర్‌తో కలిసి నిజమైన నిబద్ధతను చాటుకున్నారు.

భారీ వర్షాల కారణంగా పెద్ద ఏరు ఉద్ధృతంగా ప్రవహించింది.

గ్రామాలకు వెళ్లే మార్గం మూసుకుపోయింది.

అయినప్పటికీ సావిత్రి వెనకడుగు వేయలేదు.

ఏరు దాటి అవతలి గ్రామాలకు చేరుకున్నారు.

గర్భిణీలకు సమయానికి టీకాలు వేశారు.

వారి సేవాభావాన్ని గుర్తించి వైద్యాధికారి డాక్టర్ అజయ్ అభినందించారు.