శివకార్తికేయన్–మురుగదాస్ కాంబినేషన్ "మదరాసి" ఇప్పుడు ఓటీటీలోకి!
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన మదరాసి సినిమా సెప్టెంబర్ 5న భారీ అంచనాల మధ్య విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి, మొత్తం ₹91 కోట్ల కలెక్షన్లు సాధించింది.
సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్మిణి వసంత్ అందాలు, శివకార్తికేయన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కథ, స్క్రీన్‌ప్లే, మురుగదాస్ దర్శకత్వం మాత్రం ఆశించినంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఈ సినిమా కొంతమంది వర్గాలకే నచ్చింది.
ఇక తాజాగా మదరాసి సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం నిర్మాతలకు సుమారు ₹60 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
రూమర్స్ ప్రకారం, అక్టోబర్ 3 నుంచి మదరాసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. తమిళ్, తెలుగు భాషలతో పాటు మరికొన్ని భాషల్లో కూడా ఈ సినిమాను స్ట్రీమ్ చేసే అవకాశముంది.