1500 ఏళ్ల చరిత్రకు సాక్ష్యం

 

▪️ పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి గ్రామానికి సుమారు 1500 ఏళ్ల చరిత్ర ఉందని పురావస్తు శాఖ ధృవీకరించింది.
▪️ ఇది ప్రాచీన కాలంలో వేంగిపురంగా ప్రసిద్ధి చెందింది.
▪️ సాలంకాయనులు, విష్ణుకుండినులు పాలనలో ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది.
▪️ క్రీ.శ. 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు తూర్పు చాళుక్యుల రాజధానిగా విరాజిల్లింది.
▪️ ఇక్కడ బయటపడిన ధనందిబ్బ అవశేషాలు, శివాలయం, ఎర్రరాయి ఆలయాలు, పురాతన విగ్రహాలు దీని గొప్ప చరిత్రకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

👉 పెదవేగి చరిత్ర అంటే తూర్పు చాళుక్యుల మహిమ, ఆ కాలపు కళా–వాస్తు శిల్పాల ఔన్నత్యం గుర్తుకు వస్తాయి.