జటాధర’ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్న హీరో సుధీర్ బాబు, ఇప్పుడు తన కెరీర్‌లో కీలకమైన ప్రాజెక్ట్ జటాధరతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగు–హిందీ బైలింగ్వల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ కలిసి నిర్మిస్తున్నారు.
🔹 హీరోయిన్‌గా దివ్య ఖోస్లా నటిస్తుండగా, బాలీవుడ్ నటీమణులు సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
🔹 శుభలేఖ సుధాకర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
🔹 ఇప్పటికే సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయింది.
🔹 ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
🎬 రిలీజ్ డేట్: నవంబర్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటివరకు ఆ డేట్‌కి పెద్ద సినిమాలు లేనందువల్ల జటాధరకు మంచి లాభం చేకూరే అవకాశం ఉంది. చిన్న, మధ్యస్థాయి సినిమాలే ఉండటంతో బాక్సాఫీస్‌లో సుధీర్ బాబుకి ఈ సారి హిట్ దక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.