ముంబయి: బాలీవుడ్ బాద్‌షా, కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలిచిన స్టార్ హీరో షారూక్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం "కింగ్" షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో కండరాల నొప్పితో బాధపడుతూ ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లినట్లు సమాచారం.
డాక్టర్ల సలహాతో మెరుగైన చికిత్స కోసం షారూక్ ఖాన్ అమెరికా ప్రయాణం చేశారు. అక్కడ నెలరోజులపాటు విశ్రాంతితో పాటు స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
🔹 ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పనిలేదు
అయితే అభిమానులు టెన్షన్ పడకూడదని, ఇది తాత్కాలిక ఆరోగ్య సమస్య అని సమాచారం. త్వరలోనే ఆయన తిరిగి మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అవుతారని బాంబే టాలీవుడ్ వర్గాలు తెలియజేశాయి.
🎥 "కింగ్" మూవీ అప్‌డేట్
"కింగ్" సినిమా షూటింగ్ ప్రస్తుతం హాల్ట్‌లో ఉంది. షారూక్ పూర్తి ఆరోగ్యంతో తిరిగివచ్చేంతవరకూ చిత్ర బృందం ఓ చిన్న బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది.