పొలమూరు సరిహద్దులో అఖిలపక్ష నిరసన
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు నవుడూరు సెంటర్ సమీపంలో ఆర్ అండ్ బి రహదారి మరమ్మతులు చేయాలంటూ ఆందోళన
- గత నాలుగు సంవత్సరాలుగా ఆర్ అండ్ బి రహదారి గోతులతో పాడైపోయి వాహనదారులకు ప్రమాదాల కారణం అవుతోంది.
- తక్షణమే ఆర్ అండ్ బి రహదారి మరమ్మతులు చేపట్టాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేపట్టారు.
- రహదారి పక్కన ఉన్న ఆక్రమణలు తొలగించి, పంట కాల్వ ఆధునీకరించి శాశ్వత సిమెంట్ రోడ్డుగా నిర్మించాలని డిమాండ్.
- వర్షాకాలంలో గోతులు కనిపించకపోవడం వల్ల అనేకమంది టూ వీలర్స్, వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
- నిరసనలో వాహనదారులు, స్థానిక ప్రజలు విస్తృతంగా మద్దతు తెలిపారు.
నిరసనలో పాల్గొన్న వారు:
చింతపల్లి గురు ప్రసాద్, మేనేడి సత్యనారాయణ, కొట్టాల మధు, కేతా గోపాలన్, తూటే సురేష్, రాపాక ఆశీర్వాదం, తాడిపత్రి నరేంద్ర, పిల్లి రాజకుమార్, పిల్లి శ్రీనివాస్, చిక్కాల సత్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు.