అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు

అమరావతి: అమరావతిని భారత క్వాంటం క్యాపిటల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని తెలిపారు.

సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు రెండో రోజు అమరావతి క్వాంటం వ్యాలీపై ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆయన, ముఖ్య వివరాలు వెల్లడించారు:

  • 2025 జనవరి నాటికి 2 క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు
  • 2027 నాటికి మరో 3 కంప్యూటర్ల ఏర్పాటు
  • ఏటా రూ.5 వేల కోట్ల ఎగుమతులు సాధనే లక్ష్యం
  • రూ.1000 కోట్ల ప్రోత్సాహకాలు – కనీసం 100 స్టార్ట‌ప్‌లు
  • 90 వేల ఉద్యోగావకాశాలు, 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ నిర్మాణం
  • IBM, TCS, L&Tతో ఒప్పందాలు (MoUs) కుదుర్చిన రాష్ట్రం

భవిష్యత్తులో 3 లక్షల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల సామర్థ్యం ఈ భవన సముదాయంలో ఏర్పడనుందని ఆయన తెలిపారు.

జిల్లా స్థాయిలో ప్రజల్లో, విద్యార్థుల్లో క్వాంటం టెక్నాలజీ అవగాహన కల్పించడానికి కలెక్టర్లను రాయబారులుగా నియమించినట్లు పేర్కొన్నారు.

వైద్యం, బీమా, ఫైనాన్స్, AI/ML, మెటీరియల్ సైన్స్, లాజిస్టిక్స్, క్లైమేట్, ఎనర్జీ వంటి 14 రంగాల్లో క్వాంటం టెక్నాలజీ వినియోగం వల్ల విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు.

అమరావతిలో నిర్మించనున్న క్వాంటం వ్యాలీ భవన నమూనాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు వ్యక్తం చేశారు.